Droupadi Murmu | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Sabarimala temple) వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడ ఇరుముడి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు.
Hon’ble Rashtrapati of Bharat Smt. Droupadi Murmu at Sabarimala Ayyappa Temple, following every minute detail of the customary practices of Ayyappa darshan. pic.twitter.com/AvR0nke8cV
— J Nandakumar (@kumarnandaj) October 22, 2025
ఈ సందర్భంగా ముర్ము ఓ రికార్డు నెలకొల్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్‌గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటూ బస చేయనున్నారు. అక్కడే రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఆహారం వండి వడ్డించనున్నారు. మధ్యాహ్నం 3:10 గంటలకు ముర్ము శబరిమల నుంచి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
President #DroupadiMurmu ji offers prayers and had darshan at Sabarimala temple.. pic.twitter.com/qSC0ZQTjCJ
— Mohan Vamsi🚩 (@IamMohanVamsi) October 22, 2025
பம்பா கணபதி கோவிலில் இருமுடி கட்டிக்கொண்டு, சபரிமலை சன்னிதானம் நோக்கி புறப்பட்டார் குடியரசுத் தலைவர் மாண்புமிகு திரௌபதி முர்மு! அவர்கள்@Droupati_Murmu@ChromeTechIndia@rashtrapatibhvn#DroupadiMurmu @sabarimalatdb#Sabarimala pic.twitter.com/1fH3EsfStD
— Narayanan Papanasam (@NPapanasam) October 22, 2025
Also Read..
IMD | కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ.. క్షీణించిన గాలి నాణ్యత
PM Modi | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి.. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ