PM Modi | వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘అధ్యక్షుడు ట్రంప్.. ఫోన్‌కాల్ ద్వారా (Diwali Phone Call) దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. వెలుగుల పండుగ నాడు.. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఆశల వెలుగులు నింపుతూ ముందుకు సాగాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, అంతకు ముందు దీపావళి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు.
Also Read..
Gold Rates | గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Sneha Reddy | బన్నీ భార్య అప్పుడే తోటి కోడలిని సైడ్ చేసిందేంటి.. టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్