Sneha Reddy | తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అల్లు ఫ్యామిలీ ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. అల్లు రామలింగయ్య వారసుడైన అల్లు అరవింద్ ముగ్గురు కుమారులలో ఒకరైన అల్లు శిరీష్ ఇటీవల నిశ్చితార్థం జరుపుకొని, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్, తర్వాత ‘కొత్త జంట’, ‘ఏబీసీడీ’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఇప్పటి వరకు ఆశించినంత స్థాయిలో సక్సెస్ పొందలేకపోయారు. చివరిగా వచ్చిన ‘టెడ్డి’ చిత్రంతో ప్రేక్షకులను నిరాశపరిచారు.
కొన్ని రోజుల క్రితం శిరీష్ తన నిశ్చితార్థాన్ని ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద జరుపుకున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాను నైనికాతో నిశ్చితార్థం చేసుకున్నట్లు..నైనిక చేతిని పట్టుకున్న ఫొటోని షేర్ చేస్తూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. వేడుక నిరాడంబరంగా జరగడం విశేషం. ఇప్పటి వరకు తన కాబోయే భార్య విషయంలో గోప్యత పాటించిన శిరీష్, ఈ దీపావళి సందర్భంగా నైనికాను అభిమానులకు తొలిసారి పరిచయం చేశారు. అల్లు కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయిన ఈ సందర్భంలో తీసిన ఫ్యామిలీ ఫొటోలో శిరీష్-నైనికా జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.
“Made for each other” అంటూ కామెంట్లు చేసారు. అయితే వేడుకకి సంబంధించిన ఫొటోలని అల్లు స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అనుకోకుండా నైనిక ఫొటోని రివీల్ చేయడంతో వెంటనే తన పోస్ట్ డిలీట్ చేసి ఆ తర్వాత తోటి కోడలిని సైడ్ చేసి మరో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ .. స్నేహా రెడ్డి తెలివైనదే అని కామెంట్ చేస్తున్నారు. అయితే అప్పటికే కొందరు నైనిక ఫొటోని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. నైనికా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని తెలుస్తుంది. ఆమె కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.