Gold Rates | ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు (Gold Rates) బ్రేక్ పడింది. ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళవారంతో పోలిస్తే నేడు ఏకంగా రూ.3వేలు తగ్గింది. దీంతో ఇటీవలే రూ.1.30 లక్షలు దాటిన బంగారం ధరలు ఇప్పుడు రూ.1.28 లక్షలకు దిగొచ్చాయి.
మార్కెట్ వర్గాల ప్రకారం.. బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,100 పతనమై రూ.1,16,600గా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,350గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,750గా ఉంది. అటు వెండి కూడా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,63,900గా ఉంది.
Also Read..
సింప్లిజిత్ చేతికి అరేబియన్ సంస్థ
ఎల్టీఐమైండ్ట్రీ నుంచి వైదొలిగిన దేశ్పాండే