న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరోసారి సత్తాచాటింది. ప్రస్తుత పండుగ సీజన్లో నవరాత్రి నుంచి దీపావళి వరకు(30 రోజుల్లో) లక్ష వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 33 శాతం ఎగబాకినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని వాహన సంస్థలు తమ వాహన ధరలను భారీగా తగ్గించడంతోపాటు పండుగ సీజన్ కూడా తోవడం విక్రయాలకు కలిసొచ్చింది. వీటిలో ఎక్కువ శాతం ఎస్యూవీలు కాగా, వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయని టాటా మోటర్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. ఈ వృద్ధికి ఎస్యూవీ వాహనాలు చాలా కీలకంగా మారయని, వీటిలో 38 వేల యూనిట్ల నెక్సాన్ మాడళ్లు అమ్ముడవగా, పంచ్ 32 వేలు ఉన్నాయని చెప్పారు.