హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఇన్ఫ్రా సేవల సంస్థ సింప్లిజిత్ గ్రూపు.. వ్యాపార విస్తరణలో భాగంగా నూతన రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం అరేబియన్ కన్‌స్ట్రక్చన్ కంపెనీ(ఏసీసీ) ఇండియాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది.
ఈ కొనుగోలుతో సింప్లిజిత్ గ్రూపు..రియల్టీ, పేపర్ ఉత్పత్తుల ట్రేడింగ్, బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి మూడు కొత్త విభాగాల్లోకి ప్రవేశించినట్టు అవుతుందని కంపెనీ ఎండీ అభిజిత్ జయంతి తెలిపారు.