ఇండియానా వెల్స్ (యూఎస్ఏ): భారత టాప్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ, తన స్వీడన్ సహచరుడు గొరన్ గొరన్సన్ ఇండియానా వెల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
పురుషుల డబుల్స్‌లో బాంబ్రీ-గొరన్ ద్వయం.. 6-4, 6-4తో సాండర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)-జిరి లెహెకా (చెక్) జోడీని వరుస సెట్లలో మట్టికరిపించింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేయగా మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ ఇట లీ అమ్మాయి జాస్మిన్ పౌలోనీకి షాక్ తగిలింది.