Tragedy Love Story | దసరాకు భార్య.. దీపావళికి భర్త సూసైడ్.. పెళ్లయిన నెలకే ట్రాజెడీగా ముగిసిన లవ్‌స్టోరీ!
Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
Tragedy Love Story | ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కలిసి మాత్రం జీవించలేకపోయారు. దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు. అలా సక్సెస్ అయ్యిందనుకున్న వారి లవ్‌స్టోరీ.. పెళ్లయిన నెలలోపే విషాదాంతంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఎదురెదురు ఇండ్లలో ఉండే సంతోష్, గంగోత్రి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి కూడా చేసుకున్నారు. దసరా పండుగ కావడంతో ఈ నెల 2వ తేదీన దంపతులిద్దరూ గంగోత్రి ఇంటికి వెళ్లారు. అక్కడ మాంసం కూరలో కారం ఎక్కువైందని గంగోత్రిని సంతోష్ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి.. అదే రోజు రాత్రి అత్తారింటికి వెళ్లాక దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమించి పెళ్లిచేసుకున్న అమ్మాయి తన కారణంగానే తనువు చాలించిందని సంతోష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మనసు బాగోలేకపోవడంతో దీపావళి పండక్కి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉండే తన అక్క దగ్గరకు వెళ్లాడు. అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ కూడా నెలలోపే మరణించడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

