Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం (Ram Temple) ప్రారంభోత్సవం తర్వాత గోద్రా (Godhra) తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ‘రామాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో ప్రజలు బస్సులు, ట్రక్కుల్లో అయోధ్యకు చేరుకుంటారు. వారు తిరుగు ప్రయాణంలో గోద్రా తరహా ఘటనలు జరగొచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జల్గావ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
27 ఫిబ్రవరి 2002న గుజరాత్ రాష్ట్రంలోని అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కరసేవకుల రైలు కోచ్‌పై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే. రైలు కోచ్‌ను తగలబెట్టేశారు. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇది గుజరాత్ వ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లకు దారి తీసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా, యూపీలోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం (Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మందిరాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి కల్లా ఆ ఆలయంలోకి భక్తులను అనుమతించున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభించనున్నట్లు తెలిసింది.
Also Read..
IndiGo | ఇండిగో ఫ్లైట్‌లో మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యకర ప్రవర్తన.. రెండు నెలల్లో నాలుగోది
Cyber Crime | అసలుకు, నకిలీకి మధ్య తేడాను గుర్తించండి.. 1930పై పోలీసుల వినూత్న ప్రచారం
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ