IndiGo | విమానాల్లో ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. ముఖ్యంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబై (Mumbai) నుంచి గువాహటి (Guwahati) వెళ్తున్న ఫ్లైట్లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఆదివారం రాత్రి ఇండిగో (IndiGo) విమానం ముంబై నుంచి గువాహటికి బయలు దేరింది. అయితే విమానంలో లైట్స్ ఆఫ్ చేయగానే ఓ వ్యక్తి తన పక్కసీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా (Sexual Harassment) ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆ మహిళపై చేతులు వేసి తడమసాగాడు. సదరు ప్రయాణికురాలు గట్టిగా అరుస్తూ లైట్స్ ఆన్ చేసింది. అనంతరం ఆ వ్యక్తిపై అక్కడున్న సిబ్బందికి ఫిర్యాదు చేసింది. విమానం గువాహటి విమానాశ్రయానికి చేరుకోగానే మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని ఎయిర్లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కాగా, ఇండిగో విమానాల్లో గత రెండు నెలల్లోనే మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇది నాలుగో ఘటన కావడం గమనార్హం.
Also Read..
Cyber Crime | అసలుకు, నకిలీకి మధ్య తేడాను గుర్తించండి.. 1930పై పోలీసుల వినూత్న ప్రచారం
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
Sudan Crisis | సుడాన్లో ఆగని ఆధిపత్య పోరు.. తాజా డ్రోన్ దాడిలో 43 మంది మృతి