అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 240 మందికిపైగా మరణించారు. (Air India flight crash) 40 మందికిపైగా గాయపడ్డారు. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మెడికల్ కాలేజీ హాస్పిటల్ బిల్డింగ్‌పై విమానం కూలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది. ఇంతటి ప్రాణనష్టం తాము ఎప్పుడూ చూడలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
కాగా, అహ్మదాబాద్ విమానాశ్రయం వెలుపల మేఘనినగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కూలింది. పై అంతస్తులోని మెస్‌లో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థుల్లో ఐదుగురు మరణించారు. చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డారు. అక్కడి క్వార్టర్స్‌లో నివసిస్తున్న పలువురు వ్యక్తులు గాయపడ్డారు. అలాగే అక్కడున్న ఐదు అంతస్తుల బిల్డింగ్‌లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లలో నివసించే వారు కూడా విమాన ప్రమాదం కారణంగా గాయపడినట్లు తెలుస్తున్నది.
Also Read:
కూలిన విమానంలో.. భర్తను కలవడానికి లండన్ వెళ్తున్న కొత్త వధువు
ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికిన 38 ఏళ్ల రమేశ్ విశ్వకుమార్
‘ఆ విమానంలో చాలా సమస్యలున్నాయి’.. కూలడానికి ముందు అందులో ప్రయాణించిన వ్యక్తి