న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో (Air India flight crash) కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఒక వ్యక్తి తెలిపాడు. కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చెప్పాడు. ఆ విమానంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఆకాష్ వత్స సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి రెండు గంటల ముందు ఆ విమానంలో నేను ఉన్నా. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు అందులో ప్రయాణించా. ఆ విమానంలో అసాధారణమైన విషయాలను గమనించా’ అని తెలిపాడు.
కాగా, లండన్‌కు కనెక్టింగ్ విమానం ఉన్న ప్రయాణీకులు అందులో నుంచి కిందకు దిగారని ఆకాష్ వత్స తెలిపాడు. వారంతా ఎంట్రీ గేట్ ద్వారా మళ్లీ ఆ విమానం ఎక్కినట్లు చెప్పాడు. ‘విమానం నంబర్ మారింది. కాబట్టి లండన్‌కు వెళ్లే ప్రయాణీకులు కూడా దిగి మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది’ అని పేర్కొన్నాడు. ఆ విమానంలో పనిచేయని టీవీ స్క్రీన్, ఇతర సేవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే కొంతసేపటి తర్వాత వాటిని డిలీట్ చేశాడు.
Also Read:
అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చాలా మంది మృతి: ప్రభుత్వం