న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో (Air India flight crash) చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. విషాదకరమైన ప్రమాదమని ఆయన అభివర్ణించారు. ‘అహ్మదాబాద్‌లో జరిగినది ఒక విషాదకరమైన ప్రమాదం. మేం చాలా మందిని కోల్పోయాం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని అన్నారు. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. సంబంధిత విభాగాలు తాజా సమాచారాన్ని అందిస్తాయని చెప్పారు. ‘సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం మనం వేచి ఉండాలి’ అని అన్నారు.
కాగా, అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గురువారం మధ్యాహ్నం 1.38 గంటల సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. అనంతరం ఐదు నిమిషాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న మేఘనినగర్ ప్రాంతంలోని హాస్పిటల్ బిల్డింగ్‌పై కూలిపోయింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా 242 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. విమాన ప్రమాదంలో వీరంతా మరణించినట్లు అనుమానిస్తున్నారు.
#WATCH | Air India Plane Crash | Delhi: Replying to a question by ANI, MEA Spokesperson Randhir Jaiswal says, “What has happened in Ahmedabad is a very tragic accident. We have lost a lot of people. We extend our deepest condolences to all those who have lost their loved ones.… pic.twitter.com/H5zaotV0Q9
— ANI (@ANI) June 12, 2025
Also Read:
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEOS
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ..?
625 అడుగుల ఆల్టిట్యూడ్‌లో.. మేడే కాల్ ఇచ్చిన పైలెట్