అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో ఒకరు బతికినట్లు తెలుస్తోంది. 38 ఏళ్ల రమేశ్ విశ్వకుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో ఉన్నారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో.. 11A సీటులో అతను కూర్చున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమాన ప్రమాదంలో 242 మంది మరణించినట్లు ద్రువీకరించినా.. రమేశ్ కుమార్ మాత్రం ఆ విమానం నుంచి గాయాలతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మృత్యుంజయుడి వివరాలు మరిన్ని అందాల్సి ఉన్నది. విమానంలో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అతను దూకినట్లు భావిస్తున్నారు. ఆ మిరాకల్ ఘటనకు చెందిన ఓ వీడియో కూడా వైరల్ అవుతున్నది. అంబులెన్స్ వద్దకు రమేశ్ కుమార్ నడిచి వస్తున్న దృశ్యాలను రిలీజ్ చేశారు.
Ramesh vishwakumar survives the Air India plane crash…pic.twitter.com/aH7jt0v0Aw
— Volcaholic 🌋 (@volcaholic1) June 12, 2025