అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన విమాన ప్రమాదం నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. (Air India flight crash) అయితే మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది మరణించినట్లు భావిస్తున్నారు. కూలిన ఈ విమానంలో ఖుష్బూ రాజ్‌పురోహిత్ అనే నవ వధువు కూడా ఉన్నది. రాజస్థాన్ బలోతారా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఆమెకు ఈ ఏడాది జనవరిలో మన్ఫూల్ సింగ్‌తో పెళ్లి జరిగింది. ఆమె భర్త లండన్‌లో చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తొలిసారి లండన్‌లో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానంలో ఖుష్బూ ప్రయాణించింది. ఆ విమానం కూలిన ప్రమాదంలో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, రాజస్థాన్‌కు చెందిన సుమారు 11 మంది ఆ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించారు. బ్రిటన్‌లో చెఫ్‌లుగా పని చేయడానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె కూడా కూలిన ఆ విమానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:
‘ఆ విమానంలో చాలా సమస్యలున్నాయి’.. కూలడానికి ముందు అందులో ప్రయాణించిన వ్యక్తి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చాలా మంది మృతి: ప్రభుత్వం