Maha Kumbh | ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల తాకిడి పెరిగింది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మహాకుంభమేళాకు తరలివెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అక్కడ గంగ , యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామి చిదానంద్ సరస్వతిని (Swami Chidanand Saraswati) కలిశారు.
#WATCH | Uttar Pradesh: Actress Katrina Kaif meets Parmarth Niketan Ashram President Swami Chidanand Saraswati in Prayagraj.#MahaKumbh2025 pic.twitter.com/DHIG8UDrst
— ANI (@ANI) February 24, 2025
మరోవైపు భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Chief Election Commissioner Gyanesh Kumar, along with his family members, takes a holy dip at Triveni Sangam in Uttar Pradesh’s Prayagraj
#Mahakumbh pic.twitter.com/PcwiQgtfzK
— ANI (@ANI) February 24, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ఈ మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కుంభమేళా ముగియనుంది. ఇప్పటి వరకూ 62 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది.
Also Read..
IIT Baba | భారత్ గెలవదంటూ జోష్యం.. క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా
Akshay Kumar | మహాకుంభమేళాకు అక్షయ్ కుమార్.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు.. VIDEO