Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) మరో రెండు రోజుల్లో ముగియనుంది. 45 రోజుల పాటూ సాగే ఈ కుంభమేళాలో ఇప్పటికే 60 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, మహాకుంభ్‌పై తప్పుదారి పట్టించే కంటెంట్ (Misleading Content) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు.
మహాకుంభ్‌పై తప్పుదారి పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేసిన 140 సోషల్ మీడియా అకౌంట్స్‌పై (Social Media Handles) కేసు నమోదు చేసినట్లు మహాకుంభ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ వెల్లడించారు. ఆయా సోషల్ మీడియా ఖాతాలపై 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ మహాకుంభమేళా ముగింపు రోజు ఫిబ్రవరి 26న జరగనున్న మహాశివరాత్రి పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆరోజు పెద్ద సంఖ్యలో జనం ప్రయాగ్‌రాజ్‌కు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మేరకు మహాకుంభ్ ప్రాంతంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎంత మంది యాత్రికులు వచ్చినా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ఈ మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కుంభమేళా ముగియనుంది.
Also Read..
Belagavi | బెళగావిపై మళ్లీ భగ్గు.. మళ్లీ తెరపైకి సరిహద్దు వివాదం
Donald Sams | ఈ మట్టిలోనే కలసిపోవాలి.. తీరిన 91 ఏండ్ల ఆస్ట్రేలియన్ వృద్ధుడి చివరి కోరిక!