Donald Sams | పాట్నా, ఫిబ్రవరి 23 : భారతదేశంలో తన అంత్యక్రియలు జరగాలన్న ఒక 91 ఏళ్ల ఆస్ట్రేలియన్ పౌరుడి చివరి కోరిక శనివారం నెరవేరింది. కోల్‌కతా నుంచి పాట్నాకు క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్న సిడ్నీ వాసి డొనాల్డ్ శామ్స్ తీవ్ర అస్వస్థతకు లోనై కన్నుమూయగా ఆయన మృతదేహాన్ని బీహార్‌లోని ముంగేర్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.
ఫిబ్రవరి 10న కోల్‌కతా నుంచి పాట్నాకు గంగానదిపై క్రూయిజ్‌లో ప్రయాణం ప్రారంభించిన 26 మంది విదేశీ పర్యాటకులలో శామ్స్ ఒకరు. శుక్రవారం రాత్రి వీరంతా ముంగేర్‌లోని బబువా ఘాట్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి శామ్స్ అస్వస్థతకు గురికాగా వెంటనే ఆయనను ముంగేర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం మరణించారు. వృద్ధాప్యం కారణంగానే శామ్స్ మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.