Akshay Kumar | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు త్రివేణీ సంగమంలో నదీ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం త్రివేణీ సంగమంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Actor Akshay Kumar takes a holy dip in Sangam waters during ongoing #Mahakumbh in UP’s Prayagraj pic.twitter.com/rHRM1XrEB0
— ANI (@ANI) February 24, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ఈ మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కుంభమేళా ముగియనుంది. ఇప్పటి వరకూ 62 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది.
#WATCH | Prayagraj | After taking a holy dip at Triveni Sangam, Actor Akshay Kumar says, “I thank CM Yogi ji for making such good arrangements here…” pic.twitter.com/CQ5IcsOKZF
— ANI (@ANI) February 24, 2025
Also Read..
Marriage | గేదెల కోసం రెండో పెళ్లికి సిద్ధమైన మహిళ.. అత్తమామల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్
Mohammad Rizwan: విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు పాకిస్థాన్ కెప్టెన్ ఫిదా