Marriage | గేదెల కోసం రెండో పెళ్లికి సిద్ధమైన మహిళ.. అత్తమామల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్
Marriage | ఉత్తరప్రదేశ్‌లోని హసన్పూర్ (Hasanpur)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గేదెల కోసం ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది.
Marriage | ఉత్తరప్రదేశ్‌లోని హసన్పూర్ (Hasanpur)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గేదెల కోసం ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది. మరికాసేపట్లో వివాహం (Marriage) అనగా.. ఆమె అత్తమామల ఎంట్రీతో సీన్మొత్తం రివర్స్ అయ్యింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అస్మా అనే మహిళకు మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్‌తో వివాహమైంది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం అస్మా తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో విడాకుల కోసం అప్లై చేసుకుంది. విడాకుల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం ఆదివారం 300 జంటలకు సామూహిక వివాహ వేడుకను నిర్వహించింది. ఈ పథకం (Mass Marriage Scheme) కింద వధువుకు రూ.35,000 నగదుతో పాటు పలు బహుమతులు కూడా అందించింది. ఈ ఉచిత పథకం గురించి తెలుసుకున్న అస్మా.. రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
తన బంధువు జాబర్ అహ్మద్‌తో రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, ఇతర బహుమతులను పంచుకోవాలని ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం అందించే బహుమతుల్లో రూ.35 వేల నగదుతోపాటు వధూవరులకు రెండు జతల బట్టలు, గోడ గడియారం, వ్యానిటీ కిట్, దుపట్టా, వెండి కాలి మెట్టెలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇక నగదుతో గేదెలను (Buffaloes) కూడా కొనాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
ఇక మరికాసేపట్లో వివాహం జరుగుతుందనంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అస్మా అత్తమామల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. వివాహ ధృవీకరణ పత్రంతో అస్మా అత్తమామలు అక్కడికి చేరుకొని ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు అస్మా, జాబర్ అహ్మద్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read..
IIT Baba | భారత్ గెలవదంటూ జోష్యం.. క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా
PM Modi | ఊబకాయంపై పోరాటం.. వంటనూనె వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

