1990ల కాలంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’ (King Jackie Queen). దసరా, ది గార్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘నువ్వు తోపు’ అని సాగే పాటను మేకర్స్ శనివారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను పూర్ణచంద్ర తేజస్వి స్వరపరిచారు. అనిరుద్ధ శాస్త్రి ఆలపించారు. ఈ పాటలో దీక్షిత్ శెట్టి, శశి ఓదెల పాత్రలను పరిచయం చేసిన తీరు బావుంది. యుక్తి తరేజా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నాగేశ్ బనెల్.