corona virus | భారత్‌లో కరోనా వైరస్ (corona virus) విజృంభిస్తోంది. తాజాగా కొవిడ్ (Covid-19) కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకాం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ కొత్తగా 64 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల్లో ఐదుగురు మరణించారు.
జూన్ 3 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,026కి పెరిగింది. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,416 కేసులు వెలుగు చూడగా.. మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393, పశ్చిమబెంగాల్లో 372, కర్ణాటకలో 311 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 37కి పెరిగింది.
Also Read..
Spying | పాక్ కోసం గూఢచర్యం.. పంజాబ్ వ్యక్తి అరెస్ట్
DMK MP Kanimozhi: ఆ తేడాను వివరిస్తున్నాం: ఎంపీ కనిమొళి
అన్నా వర్సిటీ రేప్ కేసు దోషికి జీవిత ఖైదు