చెన్నై: నిరుడు తమిళనాట సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసులో దోషికి చెన్నైలోని మహిళా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. నమోదైన 11 అభియోగాలన్నీ రుజువైనందున దోషి జ్ఞానశేఖరన్కు ఎలాంటి రెమిషన్ లేకుండా కనిష్ఠంగా 30 ఏండ్ల పాటు శిక్ష అమలు చేయాలని ఆదేశించింది.
దోషి తన కుటుంబంలో ఏకైక సంపాదనపరుడినని పేర్కొంటూ శిక్ష తగ్గింపునకు అభ్యర్థించాడని జడ్జి పేర్కొనగా.. ప్రాసిక్యూషన్ అందుకు అభ్యంతరం తెలిపి అతడికి గరిష్ఠంగా శిక్ష విధించాలని కోరింది. పాలక డీఎంకేతో దోషికి సంబంధాలున్నాయని గతంలో ఆరోపణలు రాగా.. సీఎం స్టాలిన్ వాటిని ఖండించారు. తాను తన స్నేహితుడితో కలిసి ఉన్నప్పుడు జ్ఞానశేఖరన్ బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.