Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా గూఢచర్యం కేసులో పంజాబ్ రాష్ట్రం తార్న్ తరణ్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని (Punjab spy) పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్ కోసం (ISI) గూఢచర్యం చేస్తున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన గగన్‌దీప్ సింగ్ (Gagandeep Singh)ను పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ తెలిపారు. నిందితుడు ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు వెంబడి ఆర్మీ కదలికల గురించి పాక్ ఏజెంట్లకు కీలకమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆపరేషన్ సిందూర్ సమాచారాన్ని, ఆర్మీ కదలికలను (Army movement) పాక్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు గుర్తించారు. వ్యూహాత్మక ప్రదేశాలకు సంబంధించిన వివరాలను కూడా లీక్ చేసినట్లు తేల్చారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
‘గత ఐదు సంవత్సరాలుగా గగన్‌దీప్ సింగ్ పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడు. అతని ద్వారానే గగన్‌దీప్ సింగ్‌కు పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో పరిచయాలు ఏర్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది’ అని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు.
Also Read..
Parliament: పెహల్గామ్ ఉగ్రదాడి.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఇండియా కూటమి డిమాండ్
DMK MP Kanimozhi: ఆ తేడాను వివరిస్తున్నాం: ఎంపీ కనిమొళి
Earthquake | తుర్కియేలో భారీ భూకంపం.. ఏడుగురికి గాయాలు.. గ్రీస్‌లోనూ ప్రకంపనలు