న్యూఢిల్లీ: ఇండియా కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో భేటీకానున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్(Parliament) సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీపై వత్తిడి తేనున్నారు. భారత్, పాక్ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కూడా చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్ష కూటమి తమ డిమాండ్‌పై ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని భావిస్తున్నాయి. వివిధ పార్టీలు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మోదీకి లేఖలు కూడా రాశాయి. వివిధ దేశాలకు ఎంపీల బృందం వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ప్రత్యేక పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు సంతకాలు సేకరణ చేపట్టనున్నారు. ఆ లేఖను మోదీకి పంపనున్నారు.