మాడ్రిడ్ : పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు భారతీయ ఎంపీలు వివరిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని ఎంపీ బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)కి చెందిన బృందం స్పెయిన్‌లో ఉన్నది. మాడ్రిడ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు, మిగితా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు ఆమె చెప్పారు. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులను ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ తేడాను ప్రపంచ దేశాలకు విరిస్తున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఉగ్రవాద స్పాన్సర్ దేశాల గురించి వివరిస్తున్నట్లు చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకున్న దేశాలు.. ఇండియాకు మద్దతు ఇస్తున్నాయని, ఎందుకంటే ఉగ్రవాదం హద్దులు దాటుతోందని ఆయా ఆదేశాలు అంగీకరిస్తున్నట్లు ఎంపీ కనిమొళి చెప్పారు.
#WATCH | Madrid, Spain | DMK MP Kanimozhi says, “…There is a difference between the terror attacks in India and many other countries because in India, it is sponsored by a country…We have been able to explain that difference. Our government and Prime Minister have clearly… pic.twitter.com/tC1fkq4NlN
— ANI (@ANI) June 3, 2025
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ మాట్లాడుతూ.. అన్ని దేశాలు తమకు మద్దతు ఇస్తున్నాయని, మద్దతు ఇవ్వని దేశం ఏదీలేదన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను కార్నర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ ఆర్మీయే అతిపెద్ద ఉగ్రవాద గ్రూపు అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం వాళ్ల డీఎన్ఏలో ఉందన్నారు. ఉగ్రవాదాన్ని వాళ్లు ఓ పరిశ్రమలా నడిపిస్తున్నారన్నారు. అన్ని దేశాలు కాల్పుల విరమణ కొనసాగాలని సూచించాయని, మధ్యవర్తిత్వాన్ని కూడా అడ్వైజ్ చేసినట్లు చెప్పారు. కానీ ఇది ద్వైపాక్షిక సమస్య అని ఆయా దేశాలకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, పాకిస్థాన్ అతిపెద్ద ఉగ్రవాద దేశమని తెలిపారు.