Earthquake | తుర్కియే(Turkey)ను మరోసారి భారీ భూకంపం వణికించింది. మర్మారిస్ (Murmaris) సమీపంలో మధ్యధరా సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైంది.
ఈ భూకంపం కారణంగా ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ దీవి సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (European Mediterranean Seismological Centre) తెలిపింది. భూ అంతర్భాగంలో 68 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.
ఈ భూ ప్రకంపనలకు తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్ల నుంచి బయటికి పరుగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవడానికి కొంతమంది ఇళ్ల కిటికీలు, బాల్కనీల నుంచి బయటికి దూకడం వల్ల ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులను ఊటంకిస్తూ తుర్కియే మీడియా వెల్లడించింది.
Also Read..
DMK MP Kanimozhi: ఆ తేడాను వివరిస్తున్నాం: ఎంపీ కనిమొళి
అన్నా వర్సిటీ రేప్ కేసు దోషికి జీవిత ఖైదు
Nigeria floods | నైజీరియాలో జలవిలయం.. 700 మంది మృతి..!