Nigeria floods | నైజీరియాలో జలవిలయం.. 700 మంది మృతి..!
Nigeria floods | ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలు (floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Nigeria floods | ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలు (floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నైగర్ రాష్ట్రంలోని మోక్వా (Mokwa) పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దాదాపు 700 వందల వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.
గురువారం ఉదయం అకస్మాత్తుగా కుండపోత వర్షం కురవడంతో దాదాపు ఐదు గంటల్లోనే భారీ వరద పట్టణాన్ని ముంచెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ వరదలకు ఇప్పటి వరకూ 200కి పైగా మృతదేహాలను గుర్తించారు. మరో 500 మంది ఆచూకీ గల్లంతైంది. వారంతా వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో ఎవరూ సజీవంగా ఉండే అవకాశం లేనందున సహాయక చర్యలు నిలిపివేస్తున్నట్లు స్థానిక అధికారి ముసా కాంబోకు విలేకరులకు తెలిపారు.
నైగర్ రాష్ట్రంలో వాణిజ్యపరంగా మోక్వా కీలక ప్రాంతం. ఇక్కడ భారీ ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణానికి రాకపోకలు సాగించే రెండు రోడ్లు, రెండు బ్రిడ్జీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు. ఇక ఈ వదరలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక మంది గాయపడ్డారు.
Also Read..
DMK MP Kanimozhi: ఆ తేడాను వివరిస్తున్నాం: ఎంపీ కనిమొళి
అన్నా వర్సిటీ రేప్ కేసు దోషికి జీవిత ఖైదు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Floods
- Mokwa
- nigeria
- Nigeria floods
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

