AAP | ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ (BJP) ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత ఆతిశీ (Atishi) ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు.
బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే నియంతృత్వంలో అన్ని హద్దులూ దాటేశారని మండిపడ్డారు. సభలో ‘జై భీమ్’ అని నినాదాలు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు విధాన సభ ఆవరణలోకి కూడా రాకుండా బారికేడ్లు (barricades) పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి దారుణం ఎప్పుడూ జరగలేదు అంటూ ప్రభుత్వంపై ఆతిశీ మండిపడ్డారు.
సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేడ్కర్, భగత్సింగ్ల ఫొటోలు తొలగించారంటూ ప్రతిపక్ష ఆమ్ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఈ అంశంపై ఆప్ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా.. ఆప్ (AAP) నేతలు నిరసనలు చేపట్టారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఆతిశీ సహా 21 మంది విపక్ష ఎమ్మెల్యేలను ఈ వారమంతా అసెంబ్లీ (Delhi Assembly)కి రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి వెల్లడించారు.
Also Read..
Earthquake | అస్సాంను వణికించిన భూకంపం
Waqf Bill | వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!