Jammu Kashmir Assembly | న్యూఢిల్లీ : పదేండ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది. పుల్వామా నుంచి ఫయాజ్ అహ్మద్ సోఫీ, రాజ్‌పురా నుంచి ముదాసీర్ హసన్, దేవసార్ నుంచి షేక్ ఫిదా హుస్సేన్, దూరు నుంచి మోహషిన్ షఫ్కత్ మీర్, దోడ నుంచి మేహ్రాజ్ దిన్ మాలిక్, దోడ వెస్ట్ నుంచి యాసీర్ షఫీ మాతో, బనిహాల్ నుంచి ముసాసిర్ అజ్మత్ మీర్ పోటీ చేయనున్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తున్నాయి.
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలుగు వ్యక్తులైన రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
Actor Darshan | కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాజభోగాలు.. ఏడుగురు అధికారులు సస్పెండ్
Mayawati | అవన్నీ తప్పుడు వార్తలు.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు: మాయావతి
BJP | సవరించిన జాబితా రిలీజ్.. తొలి విడత కోసం 15 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ