Actor Darshan | బెంగళూరు : హత్య కేసులో నిందితుడు, కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో సకల రాజ భోగాలు అందుతున్నట్లు ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోను ఆధారం చేసుకుని పలు వార్తాపత్రికలు, టీవీ చానెల్స్‌లో కూడా వార్తలు ప్రసారమయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోను జైళ్ల శాఖ పరిగణనలోకి తీసుకుని, సంబంధిత జైలు అధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు జైలుకు వెళ్లి విచారణ చేపట్టారని తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. దర్శన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారన్న విషయంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని హోం మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించారు.
ఫొటోలో కనిపిస్తున్న దానిని బట్టి, జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న దర్శన్ జైలులోని ఓ పార్కులో జల్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో పానీయం తాగుతూ, సిగరెట్ కాల్చుతున్నారు. రౌడీ షీటర్లు విల్సన్ గార్డెన్ నాగ, నాగరాజు, కుల్ల సీనా.. దర్శన్ పక్కన కనిపిస్తున్నారు. రేణుకాస్వామి మర్డర్ కేసులో అరెస్టు అయిన దర్శన్.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Mayawati | అవన్నీ తప్పుడు వార్తలు.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు: మాయావతి
Kangana Ranaut | అన్నదాతల ఆందోళనను బంగ్లాదేశ్ అలజడితో పోల్చిన కంగనా రనౌత్
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ..!