JN.1 | కరోనా సబ్‌వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. నెలన్నరలోనే ఈ కొత్త వేరియంట్ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. ఇక భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా జనవరి 11వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 827కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపాయి. కేవలం మూడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ.. ఈ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా వందకు పైనే (ఒక్కో రాష్ట్రంలో) కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 250 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 155 కేసులు నమోదయ్యాయి. గోవాలో 49, గుజరాత్లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, రాజస్థాన్‌లో 30, తమిళనాడులో 26, తెలంగాణలో 26, ఢిల్లీలో 22, ఒడిశాలో మూడు, హర్యానాలో ఒక కేసు నమోదైంది.
A total of 827 cases of JN.1 series variant have been reported from 12 states in India till 11th January 2024. Highest number of cases (250) reported in Maharashtra: Sources
— ANI (@ANI) January 11, 2024
కాగా, దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లో ఉండే కోలుకుంటున్నారని పేర్కొంటున్నారు. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read..
Coronavirus | 24 గంటల్లో 514 కొత్త కేసులు.. మూడు మరణాలు
Earthquake | ఢిల్లీలో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో కంపించిన భూమి
fuel leak | పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం లీక్.. మణిపూర్‌లో ఘటన