CSK vs RR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కీలక మ్యాచ్ ఆడబోతున్నది. చైన్నై వేదికగా డబుల్ హైడర్ మ్యాచ్‌లో భాగంగా సీఎస్కే(CSK) పాయింట్స్ టేబుల్స్ రెండో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతున్నది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సాంసన్(Sanju Samson )బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సేన తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఆర్ఆర్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్లే.
చెన్నై తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవింద్ర, డారిల్ మిచెల్, శివం దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్) శార్ధూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్.
ఆర్ఆర్ తుది జట్టు : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.