భోపాల్: ఎన్నికల ప్రచారం సందర్భంగా సొంత పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ సీఎం మరిచిపోయారు. ఆ ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేగా పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పేపర్ స్లిప్ ద్వారా ఎంపికైన సీఎం అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (MP CM Mohan Yadav) శుక్రవారం ఇండోర్ జిల్లా మోవ్ అసెంబ్లీ పరిధిలోని జనపవ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కైలాష్ విజయ వర్గియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘కైలాష్ జీ సాబ్‌ను నేను అభినందిస్తున్నా. ఉషా జీతో కలిసి ఆయన ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు ఉషా జీ ఇక్కడ ఎమ్మెల్యేగా లేకపోయినా, ఇంతకు ముందు ఉషా జీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు’ అని అన్నారు. అయితే ఉషా ఠాకూర్ ఇప్పటికీ ఇక్కడి ఎమ్మెల్యే అని సభకు హాజరైన జనం అన్నారు.
కాగా, పొరపాటును సరిదిద్దుకునేందుకు సీఎం మోహన్ యాదవ్ ప్రయత్నించారు. ఆయన నవ్వుతూ ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు. మిమ్మల్ని ఇండోర్ నంబర్-3కి మార్చారని అనుకున్నా, క్షమించండి దీదీ అని ఉషా ఠాకూర్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఆ వేదికపై ఉన్న ఇండోర్ 3 అసెంబ్లీ ఎమ్మెల్యే గోలు శుక్లా కూడా సీఎం మాటలతో షాక్ అయ్యారు. లేచి నిల్చొని ఇండోర్ సెగ్మెంట్ 3 ఎమ్మెల్యే తాను అని చెప్పుకున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌ను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘మోహన్ యాదవ్ జీ, ఇది ఎలాంటి అధికార మత్తు? మీ ఎమ్మెల్యేను కూడా మీరు గుర్తించనప్పుడు, ప్రజలు ఏ ఆశతో మీకు ఓటు వేస్తారు?’ అని ప్రశ్నించింది. పేపర్ స్లిప్ ద్వారా ఎంపికైన సీఎం అహంకారంతో అందరినీ మరచిపోతారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
मध्यप्रदेश के भुलक्कड़ सीएम से मिलिये,
— अपने ही विधायक को पूर्व विधायक बता रहे, दूसरे क्षेत्र के विधायक को भी खड़े होकर अपनी सीट कंफर्म कराना पड़ा।मोहन यादव जी,
सत्ता का ऐसा भी क्या नशा,
जब विधायक को ही नहीं पहचानते, तो अभागी जनता किस उम्मीद से आपको वोट दे।पर्ची से जो… pic.twitter.com/G8pxtW7c3a
— MP Congress (@INCMP) May 12, 2024