Loksabha Polls 2024 : కాంగ్రెస్ సహా విపక్షాలు తమ ఓటు బ్యాంకు గురించి కలత చెందుతున్నాయని, బీజేపీ ఏ ఒక్కరికీ భయపడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి గెలిస్తే వారి ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరని ప్రశ్నించారు. వంతుల వారీగా తమ నేతలు ఏడాదికి ఒకరు చొప్పున ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారని విపక్ష నేత ఒకరు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
యూపీలోని ప్రతాప్ఘఢ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సైతం మోదీ నిర్మించారని గుర్తుచేశారు.
విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరవుతారో చెప్పలేని దుస్ధితిలో కూటమి నేతలున్నారని వ్యాఖ్యానించారు. మోదీ మరోసారి ప్రధానిగా పాలనా పగ్గాలు చేపడితే రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం సాగిస్తోందని దుయ్యబట్టారు.
Read More :
Vijay Deverakonda | డ్యుయల్ రోల్లో విజయ్ దేవరకొండ.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?