Arvind Kejriwal | ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. కీలక ఎమ్మెల్యే మిస్సింగ్
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కీలక ఎమ్మెల్యే మిస్ అయ్యారు. ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గైర్హాజరయ్యారు.
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కీలక ఎమ్మెల్యే మిస్ అయ్యారు. ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గైర్హాజరయ్యారు.
కాగా, నోయిడాలోని పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసి బెదిరించిన ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన కుమారుడు అనస్ అహ్మద్‌తోపాటు పలువురు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారని నోయిడా పోలీసులు తెలిపారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని చెప్పారు.
మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడారు. మార్చి 21న తన అరెస్టు తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ యోచించిందని తెలిపారు. అయితే ఆ ప్రణాళిక పని చేయలేదని చెప్పారు. తన అరెస్టు తర్వాత పార్టీ మరింత ఐక్యమైందని ఎమ్మెల్యేలతో అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

