Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ (Helicopter Checked) చేశారు. బీహార్ (Bihar)లోని సమస్తిపూర్‌లో ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, పోలీసులు తనిఖీలు చేశారు. అయితే, ఖర్గే హెలికాఫ్టర్‌ను తనిఖీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.
ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాఫ్టర్‌ను కూడా కేరళలో ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీలు చేశారని గుర్తు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నేతలను వదిలేస్తూ విపక్ష పార్టీ నేతలను పోలింగ్ అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించింది. ఎన్డీఏ కూటమిలోని ఆగ్రనేతలు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్లను కూడా ఇలాగే తనిఖీ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Congress president Kharge’s helicopter is being investigated by the police .
BJP is running more than 100 helicopters , was any of them investigated?#RahulModiDebate #ModiHataoDeshBachao pic.twitter.com/fx4y60U4Ck
— Surbhi (@SurrbhiM) May 12, 2024
Also Read..
Air India Express | క్రూ సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తన.. కేరళ వ్యక్తి అరెస్ట్
Arvind Kejriwal | అందుకే జైలుకెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయలేదు : అరవింద్ కేజ్రీవాల్
Ink Mark | తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు.. కేరళ మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్