మల్కాజిగిరి, జనవరి 10: అమ్మ కలలను సాకారం చేస్తూ.. ఎంతో మంది అమ్మలకు అండగా నిలిచింది.. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు.. వైద్యం కోసం వచ్చే వారికి ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం సైతం కల్పిస్తున్నారు.. నగరంలో ఇలాంటి ఆసుపత్రి ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు.. కానీ ఇది ముమ్మాటికి నిజమే. అదే మన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ ప్రాంతం లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన అరుంధతి ఆసుపత్రి.
అమ్మలాంటి ఆసుపత్రి..
అరుంధతి ఆసుపత్రిలో ఇప్పటికే లక్షల సంఖ్యలో చికిత్సలు ఉచితంగా పొందారు. కేవ లం మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందినవా రే సుమారు 8వేల మంది వరకు ఉచితంగా వై ద్య సేవలు అందుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అరుంధతి ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రిలో 24 గంటలు వైద్యసేవలు అందిస్తున్నారు. లక్షల ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే ఖరీదైన ఓపెన్‌హార్ట్ సర్జరీ సైతం అరుంధతిలో ఉచితంగా అందిస్తున్నారు.
అంబులెన్స్ సేవలు ఉచితమే…
పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం నేడు చాలా ఖరీదుగా మారింది. జీవితం మొత్తం సంపాదించినా తీరని వ్యధలు, బాధలను తీర్చే కల్పవల్లిగా అరుంధతి నిలిచింది. ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎలాంటి వ్యాధులైనా ఉచితంగా చికిత్సలు అందించి, మందులు అందజేసి, వారిని ఇంటి దగ్గర ఆరోగ్యవంతుడిగా పంపుతున్నారు. డయాలసిస్, ఫిజియోథెరపీ, కంటి పరీక్షలు, ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఎండోస్కోపీ, అల్ట్రా సౌండ్ స్కాన్, రక్త పరీక్షలు, తదితర వైద్య సేవలతోపాటు శస్త్రచికిత్స లు చేపడుతున్నారు. ఆసుపత్రిలో 17 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు రాష్ర్టాల ప్రజలకు ఉచిత చికిత్సలు
అరుంధతికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాల ప్రజలు సైతం వచ్చి ఉచిత సేవలు పొందుతున్నారు. అత్యవసర సేవలతోపాటు కిడ్నీస్టోన్ ఆపరేషన్లు,ఎముకలు, న్యూరో, తదితర సేవలు అందజేస్తున్నారు. కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, డయాబెటలాజీ, జనరల్ సర్జరీ, ల్యాప్రోస్కోప్, అనేస్తిస్యాలజీ, పల్మనాలజీ, డెంటల్, ఈఎన్టీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ప్యాతాలజీ, బ్లడ్‌బ్యాంక్, మైక్రోబయాలజీ, వైరాలజీ, క్యాత్‌ల్యాబ్, ఆర్థోపెడిక్స్ అండ్ ఆర్థోస్కోపి విభాగాలు ఉన్నాయి.
దేశంలోనే బిల్లింగ్ కౌంటర్ లేని ఆసుపత్రి మాది
ప్రజలకు అండగా ఉండాలని, ఆపదలో ఉన్నవారికి తోడ్పాటు అందించాలని మా అమ్మ చెప్పింది. నిజామాబాద్‌లో మా చిన్నప్పుడు ఆసుపత్రుల వద్ద ఎంతో మంది ఇబ్బందిపడుతున్న సంఘటనలు చూశాము. మా అమ్మ ఎప్పుడు చెబుతుండేది. మీరు గొప్పవారుగా ఎదిగితే పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్యసేవలందించాలని చెప్పింది. అన్ని రకాల సేవలు ఉచితంగా అందించాలని మా అమ్మ చెప్పింది. అమ్మ ఆశయం… నా సంకల్పంతో అమ్మ పేరుతోనే అరుంధతి ఆసుపత్రిని స్థాపించి, ఉచితంగా అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నాం. నాకు తెలిసి దేశంలోనే బిల్లింగ్ కౌంటర్లేని ఆసుపత్రి మాదే. పలు రాష్ర్టాల నుంచి అరుంధతి ఆసుపత్రికి వచ్చి ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే, ఆసుపత్రి వ్యవస్థాపకులు