Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ భద్రతా దళాల ముందు (security forces) లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. 22 మంది మావోయిస్టుల్లో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. గతేడాది సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న కూడా 26 మంది నక్సలైట్లు సరెండరైన విషయం తెలిసిందే. అంతకు కొన్ని రోజుల ముందు 70 మంది మావోలు మూకుమ్మడిగా లొంగిపోయారు.
వచ్చే మార్చి నాటికి నక్సల్స్ అంతం
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో గురువారం జరిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన 86వ రైజింగ్ డే ఫంక్షన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారని తెలిపారు. నక్సల్స్‌ను రూపుమాపడంలో.. సీఆర్పీఎఫ్ వెన్నుముకగా నిలిచినట్లు ఆయన చెప్పారు.
Also Read..
PM Modi | ఎలాన్ మస్క్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
Bangladesh: మీ మైనార్టీలపై దృష్టి పెట్టండి.. బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన ఇండియా
Road Accident | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసులు మృతి