PM Modi | ఎలాన్ మస్క్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
PM Modi | టెక్ టైకూన్, టెస్లా బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డోజ్ శాఖ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు.
PM Modi | టెక్ టైకూన్, టెస్లా బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డోజ్ శాఖ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఎలాన్ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించినట్లు తెలిపారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది అంటూ ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. టారిఫ్‌ల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతోన్న వేళ వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.
Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…
— Narendra Modi (@narendramodi) April 18, 2025
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురితో భేటీ అయ్యారు. ట్రంప్ కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)తో సైతం మోదీ భేటీ అయ్యారు. బ్లేయర్ హౌస్‌లో బ్లెయిర్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజ్యూర్లతో కలిసి వచ్చారు. ఆ సమయంలో మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు.
Also Read..
Unesco honour | భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. గర్వించదగ్గ క్షణం అన్న ప్రధాని మోదీ
Narayana Murthy | ఇన్ఫీ నారాయణమూర్తి మనవడికి రూ.3.3 కోట్ల డివిడెండ్
Bangladesh: మీ మైనార్టీలపై దృష్టి పెట్టండి.. బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన ఇండియా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

