Narayana Murthy | ఇన్ఫోసిస్ (Infosys) సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) మరోమారు హెడ్‌లైన్స్‌లో నిలిచారు. అందుకు కారణం ఆయన 17 నెలల మనవడు (Grandson) ఏకాగ్రహ్ రోహన్ మూర్తి (Ekagrah Rohan Murty) ఇన్ఫీ నుంచి డివిడెండ్ (Dividend) రూపంలో రూ.3.3 కోట్లు అందుకోవడమే.
దేశీయ అగ్రగామని ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.22 చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో నారాయణమూర్తి (Narayana Murthy) మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి ఇన్ఫీ నుంచి రూ.3.3 కోట్లు అందుకోనున్నాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్‌కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఏకాగ్రహ్ రోహన్‌మూర్తి నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే రూ.240 కోట్ల (అప్పటి విలువ) విలువైన షేర్లను నారాయణమూర్తి బహుమతిగా రాసిచ్చారు. రోహన్ మూర్తికి 15లక్షల ఇన్ఫోసిస్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది కంపెనీలో మొత్తం విలువలో షేర్లు 0.04శాతం. తాతా గిఫ్ట్‌తో యంగ్ మిలియనీర్‌గా ఏకాగ్రహ్ అవతరించాడు.
ఇక ఈ షేర్లకు గతేడాది రూ.7.35 కోట్ల డివిడెండ్ అందుకున్నాడు. ఈ ఏడాది రూ.3.3 కోట్లు అందుకోబోతున్నాడు. దీంతో ఇప్పటి వరకూ ఈ షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఈ చిన్నారి మొత్తం రూ. 10.65 కోట్లు సంపాదించాడు. ఏకాగ్రహ్ నవంబర్ 2023లో నారాయణమూర్తి- సుధామూర్తి దంపతుల కుమారుడు రోహన్‌మూర్తి, అపర్ణామూర్తికి జన్మించాడు. నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు ఆయన మూడో మనవడు. అక్షతామూర్తి-యూకే ప్రధాని రిషి సునాక్ దంపతుల ఇద్దరు కుమార్తెలకు కూడా వీరే గ్రాండ్ పేరెంట్స్.
Also Read..
Growth Rate | టారిఫ్ వార్.. భారత వృద్ధిరేటు అంచనాలకు కోత
Gold Rates | ఆల్‌టైమ్ హైకి బంగారం ధరలు