Road Accident | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు (AP natives Killed) కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా హిందూపురం వాసులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లారు. యాద్గిర్ (Yadgir) జిల్లాలోని షాపూర్(shahpur) వైపు వెళ్తుండగా.. మార్గం మధ్యలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపంలోని వంతెనను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ ఆనంద్ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గబ్బూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Shinkansen Trains : ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. టెస్టింగ్ కోసం రెండు షింకన్సెన్ రైళ్లు
Narayana Murthy | ఇన్ఫీ నారాయణమూర్తి మనవడికి రూ.3.3 కోట్ల డివిడెండ్
Unesco honour | భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. గర్వించదగ్గ క్షణం అన్న ప్రధాని మోదీ