న్యూఢిల్లీ: ముంబై నుంచి అహ్మాదాబాద్ మధ్య.. బుల్లెట్ రైళ్ల కోసం ట్రాక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ట్రాక్‌పై టెస్టింగ్ చేసేందుకు రెండు షింకన్సెన్ రైళ్ల(Shinkansen Trains)ను జపాన్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిసింది. హై స్పీడ్ రైల్ కారిడార్‌ను పరీక్షించే ఉద్దేశంతో ఆ రైళ్లను ఉచితంగా ఇచ్చేందుకు జపాన్ ఆసక్తి చూపినట్లు స్పష్టమవుతోంది. ఈ5, ఈ3 సిరీస్‌కు చెందిన ఆ రైళ్లు.. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియాకు రానున్నాయి. హై స్పీడ్ రైల్ కారిడార్‌లో ఆ రైళ్లతో కీలకమైన డేటాను సేకరించే ఛాన్సు ఉన్నది. అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము లాంటి పర్యావరణ సవాళ్ల గురించి పరీక్షించనున్నారు.
ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. షింకన్సెన్ రైళ్ల ద్వారా .. డ్రైవింగ్ కండీషన్స్, హై టెంపరేచర్ ఎఫెక్ట్స్ గురించి డేటాను సేకరిస్తాని అధికారులు చెప్పారు. టెస్టింగ్ దశలోనే ఈ10 రైళ్ల ఉత్పత్తి గురించి కూడా ప్లాన్ చేయనున్నారు. ఈ10 డిజైన్ రైళ్లను 2030లో ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్ట్స్ జనరేషన్ రైళ్లు అందుబాటులోకి వచ్చే వరకు.. స్థానికంగా తయారైన సెమీ హైస్పీడ్ రైళ్లను వినియోగించేందుకు ఇండియా ప్లాన్ వేస్తోంది. స్పీడ్‌ను పెంచేందుకు వీలైన మార్పులు చేయనున్నారు.
జపాన్‌లో షింకన్సెన్ టెక్నాలజీ ద్వారా రైళ్లను డెవలప్ చేస్తున్నారు. జపాన్ ప్రభుత్వం ఈ టెక్నాలజీ రైళ్లకు గుర్తింపు ఇస్తోంది. ఈ5 సిరీస్ రైలు.. స్లీక్ డిజైన్‌తో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారవుతుంది. ఇక ఈ3సిరీస్.. ప్రయాణికుల సౌకర్యం, సమర్థతపై ఆధారపడి ఉంటుంది. జపనీస్ ఇంజినీరింగ్‌కు ఈ రెండు రైళ్లు ప్రామాణికంగా మారాయి. జపాన్ రైళ్లను ఇంట్రడ్యూస్ ఛేసి ట్రాక్ అండ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ డేటా స్టడీ చేయనున్నారు.