Crime news : ఆస్పత్రిలో పేషెంట్‌గా ఉన్న ఓ క్రిమినల్‌ను చంపడానికి వచ్చిన వ్యక్తి అతనికి బదులుగా మరో రోగిని హతమార్చాడు. హత్యకు ముందురోజే ఆ వార్డులో సదరు బెడ్‌పై ఉన్న క్రిమినల్‌ను మరో వార్డులోని మరో బెడ్‌కు తరలించారు. దాంతో బెడ్ నెంబర్ గుర్తుపెట్టుకుని వార్డులోకి ప్రవేశించిన హంతకుడు.. ఆ బెడ్‌పై ఉన్న వేరే పేషెంట్‌ను కాల్చిచంపాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఆస్పత్రిలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆ ప్రకారం జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ నేరస్థుడిని హత్య చేసేందుకు అతని శత్రువు ఒకరు హంతకుడిని పంపాడు. పేషెంట్ వార్డు, బెడ్ నంబర్ వివరాలు తెలుసుకుని హత్యకు ప్లాన్ చేశాడు. కానీ అంతకుముందు రోజే ఆ నేరస్థుడిని మరోవార్డుకు తరలించడంతో అతడి స్థానంలోకి వచ్చిన మరో పేషెంట్ హత్యకు గురయ్యాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఉన్నతాధికారులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు గురైన రోగి 32 ఏళ్ల రియాజుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని చంపేందుకు వచ్చి మావాడిని చంపేశారని రియాజుద్దీన్ కుటుంబసభ్యులు కూడా బోరున విలపించారు.
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు.. మండిపడ్డ కేటీఆర్
Pakistan | అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు.. పాక్‌లో యంగ్ బుమ్రా.. వీడియో
SBI | రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్.. వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్లదాకా పెంపు
Janhvi Kapoor | అమ్మ కోరికను తీరుస్తున్న జాన్వి కపూర్..!