Rahul Gandhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూటమి చితికిలపడిపోయింది. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 30 స్థానాల్లో కూడా ముందంజలో లేదు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మూడింట రెండు వంతుల మెజారిటీతో దూసుకెళ్తోంది. ఏకంగా 200కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోర పరాభవం కావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లక్ష్యంగా బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
రాహుల్ ఇప్పటి వరకూ 95 ఎన్నికల్లో ఓడిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 2004 నుంచి 2025 వరకూ దేశంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దాదాపు 95 ఎన్నికల్లో ఓడిపోయిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malviya) అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీకి మరో ఎన్నిక, మరో ఓటమి. ఈ ఓటమితో రాహుల్ 95 సార్లు ఓడిన రికార్డును కైవసం చేసుకున్నారు. ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. అవన్నీ రాహుల్‌కే దక్కుతాయి’ అంటూ మాలవీయ ఎక్స్ పోస్టులో ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Rahul Gandhi!
Another election, another defeat!
If there were awards for electoral consistency, he’d sweep them all.
At this rate, even setbacks must be wondering how he finds them so reliably. pic.twitter.com/y4rH6g62qG— Amit Malviya (@amitmalviya) November 14, 2025
కాగా, దేశంలో ఓట్ల చోరీ జరిగిరందంటే రాహుల్ గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ‘ఓట్ చోరీ’ అస్త్రంగా బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు దాదాపు 23 జిల్లాల పరిధిలో 16 రోజులపాటూ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టారు. తమను ఓడించేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మకై కుట్రలు చేస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ‘ఓట్ చోరీ’ ప్రభుత్వం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Also Read..
Tejashwi Yadav | ఓటమి దిశగా తేజస్వీ యాదవ్.. బీహార్‌లో ఎన్డీయే ప్రభంజనం
NDA | బీహార్‌లో ఎన్డీయే డబుల్ సెంచరీ.. 201 స్థానాల్లో ఆధిక్యం.. ఏ పార్టీకి ఎన్నంటే..?