NDA | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) ఎన్డీయే జోరు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. అంచనాలను మించి డబుల్ సెంచరీని దాటింది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే కూటమి 201 స్థానాల్లో ముందంజలో ఉన్నది. అందులో బీజేపీ 91 స్థానాల్లో, జేడీ(యూ) 81, లోక్ జన్‌శక్తి (రాంవిలాస్) 21, కూటమిలోని మిగతా పార్టీలు ఎనిమిది స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 36 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అందులో ఆర్జేడీ 27, కాంగ్రెస్ 4, సీపీఐ (ఎమ్) ఒక్క స్థానం, సీపీఐ (ఎమ్ఎల్) 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఇతరులు ఆరు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పార్టీ జన్ సురాజ్ ఖాతా కూడా తెరవలేదు.
Also Read..
Congress | బీహార్‌లో పనిచేయని ఓట్ చోరీ అస్త్రం.. రాహుల్ ఎక్కడ..? అంటూ నెట్టింట పోస్టులు
Mahagathbandhan | ఘోర పరాభవం.. మహాగఠ్‌బంధన్‌కు గతంలోకంటే సగం స్థానాలు కూడా దక్కలేదు..!