చెన్నై: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు (Tamil Nadu) విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. శుక్రవారం ఒక ప్రభుత్వ స్కూల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడారు. ఒక భాష (హిందీ)ను బలవంతంగా రుద్దడం వల్ల కర్ణాటకలోని బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాషా విధానంపై ఆయన మండిపడ్డారు. ‘మూడవ భాష తప్పనిసరి కాదు. ఒక ఎంపికగా ఉండాలి’ అని అన్నారు.
కాగా, విద్యా రంగంలో రాణించిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కీలకమైన విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని మంత్రి అన్బిల్ మహేష్ ఆరోపించారు. ‘కేంద్రం విద్యా నిధులను నిలిపివేయడం ద్వారా రాష్ట్రాలను బెదిరిస్తోంది. కానీ ముఖ్యమంత్రి స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. పూర్తి ఖర్చును రాష్ట్రం భరిస్తుందని హామీ ఇచ్చారు’ అని ఆయన అన్నారు.
Also Read:
Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్.. తర్వాత ఏం జరిగిందంటే?
Shivakumar | ‘రెండు మూడు నెలల్లో శివకుమార్ సీఎం’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు