ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

కోల్‌కతా: నెల రోజుల క్రితం బీజేపీ కార్యకర్త అయిన తన కుమారుడు గోపాల్ మజుందార్‌కు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు శోవ మంజుందార్ (85) మృతిచెందారు. ఉత్తర 24 పరగణాల జిల్లా నిమ్టా ఏరియాలో గత నెలలో శోవ మజుందార్ కుమారుడు గోపాల్ మజుందార్‌కు, అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో శోవ మజుందార్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి.
కాగా, శోవ మజుందార్ మృతి ఇప్పుడు బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. టీఎంసీ గూండాల దాడిలో గాయపడి వృధ్దురాలు శోవ మజుందార్ మృతిచెందడం విచారకరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ వృద్ధురాలు మరణంతో ఆమె కుటుంబం అనుభవించే క్షోభ సుదీర్ఘకాలం మమతా దీదీని వెంటాడుతుందని ఆయన ట్విట్టర్ వేదికగా శాపనార్థాలు పెట్టారు.
అయితే, టీఎంసీ మాత్రం శోవ మజుందార్‌పై టీఎంసీ కార్యకర్తలు చేయిచేసుకున్నారన్న బీజేపీ ఆరోపణలు శుద్ధ అబద్ధమని మండిపడింది. శోవ మజుందార్ మరణవార్త వినాల్సి రావడం బాధాకరమని, అయితే ఆమెపై తమ పార్టీ కార్యకర్తలు ఎలాంటి దాడికి పాల్పడలేదని టీఎంసీ సీనియర్ నాయకుడు, ఎంపీ సౌగతారాయ్ చెప్పారు. గోపాల్ మజుందార్‌కు, టీఎంసీ కార్యకర్తలకు గొడవ జరుగుతుండగా ఆందోళన చెందిన శోవ మజుందార్ తనకుతానుగా తూలి పడటంతో గాయాలయ్యాయని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
శరద్‌పవార్‌కు స్వల్ప అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

