బీజేపీ ప్రచారానికి రిలయన్స్ నిధులు.. ముఖేశ్ అంబానీపై ఎలాన్ మస్క్ విమర్శల దాడి
భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు.
న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. శనివారంనాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, అధికార బీజేపీకి నిధులు సమకూర్చిన రిలయన్స్ సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయన్న కథనాలతో పాటు, రిలయన్స్ అనుబంధ సంస్థ పెద్ద ఎత్తున రాజకీయ విరాళాలు ఇచ్చిందన్న వార్తా నివేదికల స్క్రీన్ షాట్లను మస్క్ పంచుకున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ. 385 కోట్లు, శివసేనకు రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చిందన్న క్విక్ సైప్లె సంస్థపై 2024 నాటి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనాన్ని ఆయన తన పోస్ట్‌లో ప్రస్తావించారు. మరోవైపు దేశంలో టెలికం, ఉపగ్రహ సేవల అనుమతుల ప్రక్రియ పూర్తి న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరిపైనా పక్షపాతం చూపుతున్నారనే వాదనలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఈ వారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ సదస్సులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

