ఇన్నారుల్లా!
రిజర్వాయర్లల్ల నీళ్లు లేవు, వరి పంటకు నీళ్లియ్యలేం అని ఓ మంత్రి సెలవిచ్చిండ్రు. మందుబాబులారా బేఫికర్! బీర్ల తయారీకి నీళ్ల కొరత రానీయం’ అని మరో మంత్రి భరోసా ఇచ్చిండ్రు. ఎండిన పొలాన్ని చూసి రైతు గుండె గుభేల్మంటుంటే, బీరు బాటిల్స్‌తో వచ్చే ఆదాయం కోసం సర్కారోళ్ల గుండె ఘల్లు ఘల్లు అంటుందన్నమాట. మంత్రుల వ్యాఖ్యలు చూస్తేనే తెలిసిపోతున్నది.. ఈ సర్కార్ ప్రాధాన్యతలు ఏందో. రైతు పంటకు లేని నీళ్లు బీర్ల కంపెనీల కోసం ఎక్కడి నుంచి వస్తయో!
- దాము నర్మాల
పంటకు నిల్.. మందుకు ఫుల్!
రిజర్వాయర్లల్ల నీళ్లు లేవు, వరి పంటకు నీళ్లియ్యలేం అని ఓ మంత్రి సెలవిచ్చిండ్రు. మందుబాబులారా బేఫికర్! బీర్ల తయారీకి నీళ్ల కొరత రానీయం’ అని మరో మంత్రి భరోసా ఇచ్చిండ్రు. ఎండిన పొలాన్ని చూసి రైతు గుండె గుభేల్మంటుంటే, బీరు బాటిల్స్‌తో వచ్చే ఆదాయం కోసం సర్కారోళ్ల గుండె ఘల్లు ఘల్లు అంటుందన్నమాట. మంత్రుల వ్యాఖ్యలు చూస్తేనే తెలిసిపోతున్నది.. ఈ సర్కార్ ప్రాధాన్యతలు ఏందో. రైతు పంటకు లేని నీళ్లు బీర్ల కంపెనీల కోసం ఎక్కడి నుంచి వస్తయో! పంట పండితే భారం, బీరు అమ్మితే ఆదాయం అని నమ్ముతున్నట్టున్నది ప్రభుత్వం. నిజానికి నీళ్ల కొరత ఉన్నా కూడా ఆ నీళ్లను ఎవరికి, ఎప్పుడు, ఎట్ల కేటాయించాలన్నది ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన విషయం. వానలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ముందస్తు సూచనలు ఇయ్యాలె. సాగునీటి లెక్కలు చెప్పాలె. పంట నష్టపోయిన రైతుకు భరోసా కల్పించాలె. ఇవన్నీ పక్కనబెట్టి ఒకరికి పారాహుషార్, ఇంకొకరికి బేఫికర్ అనడం బాలేదు! రైతు బతికుంటేనే రాజ్యం బతుకుతదన్న సోయి లేకపోతే ఎట్లా? జనాలు బీరు తాగి బతుకుతరా, బియ్యంతో వండుకొని తినే అన్నంతో బతుకుతరా? సర్కారోళ్లకు జనం చెప్పేది ఒక్కటే మాట.. బీర్ల కంపెనీకి భరోసా ఇచ్చినట్టే, రైతు బతుక్కు కూడా భరోసా ఇవ్వాలని. లేకపోతే కడుపు రైతన్నలు కన్నెర్రచేస్తే ఎట్లుంటదో చూపిస్తరు.
పాత వాడకం.. కొత్త షాక్!

నెలనెలా వాడిన కరెంటు బిల్లు చేతికొస్తే చాలు.. ఇంట్ల ఫ్యాన్ తిరిగినా తిరగకపోయినా సామాన్యుడి గుండె మాత్రం గిర్రున తిరుగుతది! అలాంటిది రెండుమూడేండ్ల కిందటి కరెంటుకు ఇప్పుడు ‘ట్రూ-అప్ చార్జీలు’ అనే అందమైన పేరుతో వాతలు పెడుతుంటే ఎట్టుంటది! ఎప్పుడో ఆ ఇంట్ల కిరాయికి ఉన్నోళ్లెవరో! మీటర్లో తిరిగిన యూనిట్లెన్నో? ఇప్పుడు బిల్లు కడుతున్నోళ్లెవరో? సమాధానాలు చెప్పేటోళ్లే లేరా? అని జనం అడుగుతున్నరు. 2016-17 నుంచి 2022-23 వరకు విద్యుత్తు కొనుగోళ్ల అదనపు వ్యయం, వీలింగ్ ట్రూ-అప్ బకాయిల కింద రూ.12,718 కోట్ల భారం వేయాలని డిస్కంలు కోరినయ్. అప్పుడు ఆ భారాన్ని కేసీఆర్ సర్కార్ జనాల మీద పడకుండా ఐదేండ్లలో ఏటా రూ.2,543.6 కోట్ల చొప్పున వడ్డీతో చెల్లించేందుకు అంగీకరించింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ చార్జీలను ఈఆర్సీ నిర్ణయించింది. ఇందులో గృహ వినియోగానికి సంబంధించిన రూ.5,420 కోట్ల భారం ప్రజల వేస్తున్నది. బాత్రూముల ఓపెనింగ్‌కు కూడా మంత్రులు హెలికాప్టర్లలో దర్జాగా తిరుగుతున్న ఈ కాలంలో పేదోడి మీద కరెంటు బిల్లుల భారం వేయడం సమంజసమా? అని నిలదీస్తున్నారు వినియోగదారులు.
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

